close

తాజా వార్తలు

Published : 06/07/2020 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుక్కెడు అన్నం పెట్టండి సామీ..!

ఆహారం కోసం నిత్యం ఓ పండుటాకు ఆక్రందన


రహదారిపై వెళ్లేవారిని దీనంగా ఆహారం అడుగుతున్న నంజమ్మ

చెన్నేకొత్తపల్లి :  జీవిత చరమాంకంలో బుక్కెడు బువ్వ కోసం ఓ వృద్ధురాలి ఆవేదన చూసిన కొందరు వాహనదారులు క్రమం తప్పకుండా ఏదో ఒక ఆహారం ఇచ్చి వెళుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్‌ఎస్‌గేట్‌ నుంచి ధర్మవరానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్యాదిండి ఆంజనేయస్వామి గుడి వద్ద ఓ శిథిల భవనంలో 85 ఏళ్ల వయసున్న నంజమ్మ అనే వృద్ధురాలు తలదాచుకుంటోంది. ఆమె దీనస్థితిని చూసి ‘న్యూస్‌టుడే’ పలకరించగా... ఆలయ అర్చకుడైన తన భర్త చనిపోవటంతో మూడేళ్లుగా తాను ఇక్కడే ఉంటున్నానని చెప్పింది. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారనీ.. ఓపిక ఉంటే అడుక్కుంటానని, లేకపోతే శిథిల భవనంలోనే ఉంటానంది. పదిమందికి పెట్టిన చేతితోనే పదుగురు నడిచే దారి పక్కన కూర్చుని ఆహారం కోసం యాచించాల్సి వస్తోందని గద్గద స్వరంతో వాపోయింది. రోజూ పెట్టేచోట ఎక్కడైనా వదిలి పుణ్యం కట్టుకోండయ్యా అని దీనంగా అర్థిస్తోంది.కాస్త అన్నం పెట్టండి సామీ.. మీకు పుణ్యం ఉంటుంది.. అంటూ ఓ అవ్వ రహదారి పక్కన చేసే ఆక్రందన నిత్యం చూపరులను కలచివేస్తోంది. చూపు మందగించిన స్థితిలో దూరంగా వాహన శబ్దం వినపడిందంటే చాలు.. దారి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ ఆకలిగా ఉందంటూ సైగలు చేస్తుంది. సక్రమంగా నిలబడలేదు. కూర్చోలేదు. ఎవరైనా కనికరించి ఆహారం అందిస్తే తీసుకుని వారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆ అవ్వ గురించి ఎవరైనా అడిగితే తన గురించి చెప్పి కన్నీటి పర్యంతం అవుతోంది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని