close

తాజా వార్తలు

Published : 06/07/2020 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలికపై ముగ్గురి అత్యాచారం

గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి..

ఎలమంచిలి గ్రామీణం: అమ్మానాన్న చిన్నతనంలోనే దూరమయ్యారు. పెద్దగా చదువుకోలేదు. లోకం పోకడ తెలియదు. మంచిచెడులకు మధ్య తేడా తెలియని కౌమారం. ఇదే అదనుగా ముగ్గురు కామాంధులు ఆ బాలికను మభ్యపెట్టారు. చివరకు తను గర్భం దాల్చి ఆరునెలలైనా ఆ విషయం ఆమెకే తెలియలేదు. ఓ బాలికపై ముగ్గురు అత్యాచారం చేసిన ఈ ఘటన ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో వెలుగుచూసింది.

ఎలమంచిలి సీఐ నారాయణరావు ఆదివారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం... కొత్తలి గ్రామానికి చెందిన బాలిక (15) చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటోంది. 9 తరగతి వరకూ చదివిన బాలికను చదువు మానిపించడంతో ఇంటి వద్దే ఉంటోంది. నాయనమ్మ, తాతయ్యలు వ్యవసాయ కూలీలు కావడంతో ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రికి తిరిగి వస్తారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటం ముగ్గురు గమనించారు. ఆమె ఒంటరితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏడాదిగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ కారణంగా బాధితురాలు గర్భం దాల్చింది. ఇటీవల బాలిక పొట్ట ఎత్తుగా రావడంతో నాయనమ్మ ఆమెను తుని ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ఆరునెలల గర్భవతి అని తేల్చిచెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. ఏమి జరిగిందని బాలికను ప్రశ్నించడంతో వ్యవహారం అంతా బయటపడింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు పెయింటర్‌ కాగా, మరొకరు వ్యవసాయ కూలీ. మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని గుర్తించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎలమంచిలి గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని