close

తాజా వార్తలు

Published : 07/07/2020 04:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెనో కొత్త క్విడ్‌

ప్రారంభ ధర రూ.4.16 లక్షలు

ముంబయి: ఫ్రాన్స్‌ వాహన సంస్థ రెనో హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ క్విడ్‌లో కొత్తగా ఆర్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. బీఎస్‌-6 ఇంజిన్‌ కలిగిన ఈ వెర్షన్‌ ప్రారంభ ధర రూ.4.16 క్షలు. కొత్త ఆర్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ ఎంటీ, ఏఎంటీ వెర్షన్లలో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.4.16 లక్షలు, రూ.4.48 లక్షలుగా నిర్ణయించారు. ఇక దేశంలో క్విడ్‌ మోడల్‌ అమ్మకాలు 3.5 లక్షలు దాటాయని కంపెనీ తెలిపింది. దేశంలో రెనో వృద్ధికి క్విడ్‌ మోడల్‌ చాలా కీలకమైన పాత్ర పోషించిందని, 3.5 లక్షల మందికి పైగా కుటుంబాలకు క్విడ్‌ చేరడం గొప్ప విషయమని రెనో ఇండియా కంట్రీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌రామ్‌ మామిళ్లపళ్లి అన్నారు. కంపెనీ కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈఎంఐ ఆధారిత ‘ బై నౌ పే లేటర్‌’ పథకాన్ని ప్రవేటశపెట్టింది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న విక్రయశాలలతో పాటు కంపెనీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో పొందొచ్చు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని