
తాజా వార్తలు
పసిడి ఈటీఎఫ్‌లలోకి రూ.3500 కోట్లు
దిల్లీ: ఈ ఏడాది తొలి అర్థభాగంలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లలోకి రూ.3500 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, సురక్షితమని భావించే మదుపుదార్లు వీటిల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. 2019 జనవరి-జూన్‌లో చూస్తే, పసిడి ఈటీఎఫ్‌ల నుంచి రూ.160 కోట్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. నెలలవారీగా చూస్తే జనవరిలో రూ.202 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1483 కోట్లు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. మార్చిలో రూ.195 కోట్ల మేర ఉపసంహరించారు. ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు, జూన్‌లో రూ.494 కోట్లు పెట్టుబడులు తరలివచ్చాయి. 2011 తరవాత బంగారం ధర ఈ ఏడాదే అధికంగా పెరుగుతున్నందున, మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.
Tags :