close

తాజా వార్తలు

Published : 07/08/2020 07:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ కిరణాలు.. కరోనా సంహరణాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తరణలో సామగ్రిది కూడా కీలక భూమికే. ముఖ్యంగా విమానయానంలో ప్రయాణం మొదలు, గమ్యస్థానం చేరేలోగా సామగ్రి పలు చేతులు మారుతుంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యంత ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలతో వస్తువులను స్కాన్‌(అల్ట్రావయొలెట్‌ రేస్‌ డిస్‌ఇన్ఫెక్ట్‌ స్కానింగ్‌) చేసే యంత్రాలను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమకూర్చుకుంది. ఈ యంత్రం లోపలికి సామగ్రి వెళ్లగానే 360 డిగ్రీల కోణంలో అతినీల లోహిత కిరణాలు విస్తరిస్తాయి. ఏమూలన ఎలాంటి వైరస్‌, సూక్ష్మక్రిములున్నా ఈ కిరణాలు క్షణాల్లో వాటిపై దాడి చేసి నాశనం చేస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాల రాకపోకలు లేని కారణంగా ఈ యంత్రాలను దేశీయ ప్రయాణికుల(డొమెస్టిక్‌) చెక్‌ఇన్‌ ప్రాంతాల్లో 12 చోట్ల అమర్చినట్టు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.