close

తాజా వార్తలు

Published : 10/08/2020 08:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతిమ సంస్కారంలో అన్నీ తామై!

కొవిడ్‌ మృతదేహాలకు ఉచితంగా అంత్యక్రియలు

‘యూత్‌ వెల్ఫేర్‌ తెలంగాణ’ సభ్యులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా బారినపడి చనిపోతే అంత్యక్రియలకు కనీసం కుటుంబ సభ్యులు ముందుకు రాని దైన్యస్థితిని అనేకచోట్ల చూస్తున్నాం. అలాంటి మృతదేహాలకు అంత్యక్రియలు ఉచితంగా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది ‘యూత్‌ వెల్ఫేర్‌ తెలంగాణ సంస్థ’. సమాచారమిస్తే చాలు వెంటనే చేరుకుంటున్నారు సంస్థ సభ్యులు. ‘‘నగరానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో పోరాడి చనిపోతే..ఆ విషయం తెలిసి కుమారుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. అలాంటివారికి అంత్యక్రియలను ఉచితంగా నిర్వహించాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు ‘జలాలుద్దీన్‌ జఫర్‌’. ఈ సంస్థలో 50 మంది వాలంటీర్లు ఉన్నారు. పలు శ్మశాన వాటికల్లో ఇప్పటి వరకు 108 మందికి పైగా కొవిడ్‌ మృతదేహాలకు అంతిమ సంస్కారాన్ని ఈ సంస్థ నిర్వహించింది.

కోరితే వాహనమూ పంపుతున్నాం - జలాలుద్దీన్‌, సంస్థ నిర్వాహకుడు

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. తాండూర్‌లోనూ వాలంటీర్లు ఉన్నారు. మున్ముందు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కొందరికి శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు ఉండదు. వారికి ఉచితంగానే వాహనాన్ని పంపుతున్నాం. ఆఖరి క్షణాలు సవ్యంగా జరగాలన్నదే మా ఆకాంక్ష. కొవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించాలని 73969 69475 నంబరులో సంప్రదిస్తే వెంటనే అక్కడికి చేరుకుంటాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.