close

తాజా వార్తలు

Updated : 20/09/2020 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భద్రాచలం-చర్ల రహదారిపై మందుపాతరలు

తనిఖీల్లో గుర్తించి నిర్వీర్యం చేసిన పోలీసులు

చర్ల, న్యూస్‌టుడే: భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు శనివారం నిర్వీర్యం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలివేరు-తేగడ గ్రామాల నడుమ రహదారి పక్కన మావోయిస్టులు ఏర్పాటు చేసిన మూడు మందుపాతరలను.. రోడ్డు తనిఖీల్లో భాగంగా పోలీసులు గుర్తించారు. ఇది ప్రధాన రహదారి కావడంతో తేగడ క్రాస్‌రోడ్‌, కలివేరు గ్రామాల మధ్య గంటన్నరకుపైగా రాకపోకలను నిలిపివేశారు. అనంతరం పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు పేలుడు పదార్థాలను తొలగించి సమీప ప్రాంతంలో పేల్చివేశారు. ఘటనా స్థలాన్ని ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరుగనున్న మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.