close

తాజా వార్తలు

Updated : 29/09/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కథానాయికలకు దక్కని జామీను

బెంగళూరు (మల్లేశ్వరం) : డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిల జామీను అర్జీని ఏసీఎంఎం న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. రాగిణి, సంజన ఇద్దరూ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ఈడీ అధికారుల విచారణనూ కొనసాగిస్తున్నారని, జామీను మంజూరు చేస్తే సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని సీసీబీ తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. కథానాయికలపై ఉన్న ఆరోపణలు రుజువైతే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనల్లో పేర్కొన్నారు. వాదనలు పరిగణనలోకి తీసుకుని వారిద్దరి జామీను అర్జీలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. జామీను కోసం ఉన్నత న్యాయస్థానం అర్జీ వేసుకుంటామని కథానాయకల తరపు న్యాయవాదులు తెలిపారు.

●*డ్రగ్స్‌ కేసులో ఏ1గా ఉన్న శివప్రసాద్‌ ఉన్నత న్యాయస్థానంలో వేసుకున్న అర్జీని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వీరేన్‌ ఖన్నా వేసుకున్న జామీను అర్జీ విచారణ అక్టోబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. ఇతర నిందితులు అభిస్వామి, ప్రశాంత్‌ రాజ్‌, వైభవ్‌ జైన్‌, ప్రతీక్‌ శెట్టి, శివప్రసాద్‌లు వేసుకున్న జామీను అర్జీల విచారణ రేపటికి (బుధవారం) వాయిదా పడింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.