close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళలే.. సృజనశీలురు

వృత్తిజీవితం ఆరంభంలో నిర్ణయాత్మకంగా 60 శాతం మంది
పైస్థాయికెళ్లేసరికి 30 శాతమే : నివేదిక

ముంబయి: ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో 60 శాతం మంది మహిళలకు అధిక నిర్ణయాత్మక శక్తి, సృజనాత్మక ఆలోచనలు ఉంటున్నాయి. అయితే పై స్థాయిలకు వెళ్లే కొలదీ ఆ గణాంకాలు 30 శాతానికి తగ్గిపోతున్నాయని ఓ నివేదిక తెలిపింది. ‘వృత్తిగత జీవితం మొదలైన సమయంలో 60% మంది మహిళలు; 40% పురుషులకు నిర్ణయాత్మక శక్తి, సృజనశీలత ఉంటోంది. అయితే పైకెళ్లేకొద్దీ 30 శాతం మహిళలు, 70 శాతం పురుషులుగా ఆ గణాంకాలు మారుతున్నాయి. కీలక హోదాల్లో మహిళల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణమని’ స్కికీ రూపొందించిన నివేదికలో తేలింది. 22-47 ఏళ్ల వయసులోని 5,388 మంది ఐటీ వృత్తినిపుణులపై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు తేలాయి. అటు వ్యక్తులు, ఇటు కార్పొరేట్లు కలిసి ఈ లింగ అసమానతలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ప్రతి కంపెనీ మరింత మంది మహిళలను నియమించుకుని, అంతరాలను తగ్గించడం ద్వారా సమానతను సాధించవచ్చని వివరించింది. పురుషులతో సమానంలో మహిళలు దాదాపు అన్ని విభాగాల్లోనూ(డేటా ఆధారిత బాధ్యతలు; డిజైన్‌, సృజనాత్మక హోదాలు, సాంకేతిక పనులు)  సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. విక్రయాలు, కస్టమర్‌ ఆధారిత బాధ్యతలు, రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వాటిలో పురుషులతో పోలిస్తే మహిళలే మిన్నగా కనిపించారని వివరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.