close

తాజా వార్తలు

Updated : 19/01/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భీమవరం మర్యాదా.. మజాకా..!

ఇంటి అల్లుడికి 125 రకాల రుచులతో భోజనం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి సాధారణంగా పంచభక్ష్య పరమాన్నాలో... పిండి వంటలో, మిఠాయిలో రుచి చూపిస్తారు. మాంసాహారులైతే మసాలా ఘుమఘుమలతో ఆరేడు రకాల రుచులను అందిస్తారు. కానీ గోదావరి జిల్లాల్లో మర్యాదలు ప్రత్యేకం. భీమవరం పట్టణానికి చెందిన కురిశేటి కాశీవిశ్వనాథం తన అల్లుడికి పిండి వంటలు, మిఠాయిలు, ఐస్‌క్రీమ్‌.. ఇలా 125 రకాల రుచులను అరటి ఆకుపై వెండి పళ్లెంలో వడ్డించారు. ఉంగుటూరుకు చెందిన అల్లుడు నారాయణ అఖిల్‌ ఆ వంటలను చూసి ఆశ్చర్యపోయి.. వెంటనే తేరుకుని ఆరగించడం ప్రారంభించారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా తెలిసి.. భీమవరం మర్యాదలా.. మజాకా.. అని చర్చించుకున్నారు.




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని