close

తాజా వార్తలు

Updated : 22/01/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తి కోసమే ఈ దారుణం

తల్లీ కూతుళ్ల హత్యతో సంచలనం

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం

 

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న అదనపు డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ మాధవి
 

హుజూరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య, కుమార్తెపై పాశవికంగా దాడికి పాల్పడ్డాడు భర్త.. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కొక్కిసల వెంకటేష్‌, అతని భార్య రమ, కుమార్తెను బుధవారం అర్ధరాత్రి దాటాక నిద్రిస్తున్న వీరిని హత్య చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

పట్టణ సీఐ వాసంశెట్టి మాధవి, అదనపు డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించి విలేకరులకు వివరాలను వెల్లడించారు. వెంకటేష్‌ను తన మొదటి భార్య విడిచిపెట్టడంతో సుమారు 20 ఏళ్ల క్రితం తిరిగి కరీంనగర్‌ సమీపంలోని ఆరెపల్లికి చెందిన రమ అనే వివాహితకు ఓ కూతురు ఉండగా పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్‌ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. వారు నివసిస్తున్న ఇల్లు రమ పేరుపై ఉండటంతో వెంకటేష్‌ తన పేరున మార్చుకోవడానికి పలుమార్లు ఒత్తిడి చేశాడు. ఈ విషయమై తరచూ గొడవలు జరిగేవన్నారు. బుధవారం రాత్రి అదనుచూసిన వెంకటేష్‌ నిద్రిస్తున్న తన భార్య రమ, కూతురు ఆమనిలపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సాయిరూప గార్డెన్‌ వెనుక వీధిలో ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. సాయంత్రం వరకు కాలనీవాసులతో కలిసి ఉన్న రమ, ఆమె కూతురు ఆమని తెల్లవారేసరికి మృత్యువాత పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను చూసేందుకు పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకొన్నారు. కట్టుకున్న భర్తే కడతేర్చడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపించారు.

నిందితుడు వెంకటేశ్‌

నిందితుడి అరెస్టు

నిందితుడు కొక్కిస వెంకటేష్‌ను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇల్లు కట్టిన సమయంతో పాటు ఆమని వివాహానికి వెంకటేష్‌ కొంత అప్పు చేసినట్లు తెలిపారు. ఇంటితో పాటు ఆటోను అమ్మి అప్పు తీర్చాలని పలుమార్లు రమతో చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. భార్య రమ, కూతురు ఆమనిలపై వెంకటేష్‌ కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ స్పష్టం చేశారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని