close

తాజా వార్తలు

Updated : 24/01/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.120 కోట్ల పెట్టుబడులు.. 5 కిలోల బంగారు కడ్డీలు

పాల్‌ దినకరన్‌ ఇళ్లు, సంస్థల్లో ఐటీ సోదాలు
విచారణకు హాజరుకావాలని ఐటీ నోటీసు

చెన్నై, విల్లివాక్కం, న్యూస్‌టుడే: క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, ఫౌండేషన్‌లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నుంచి సోదాలు చేస్తున్నారు. లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులు గుర్తించారు. కోయంబత్తూరులోని కారుణ్య విశ్వవిద్యాలయంలో 5 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకొన్నారు. విచారణకు హాజరుకావాలని ఆయనకు అధికారులు నోటీసు పంపారు. పాల్‌ దినకరన్‌కు చెందిన ‘జీసస్‌ కాల్స్‌’ సంస్థ కార్యాలయాలు, కారుణ్య విశ్వవిద్యాలయం తదితర 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. 20వ తేదీన ప్రారంభించిన ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయి. సభల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని.. స్వదేశం, విదేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని సమాచారం.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని