close

తాజా వార్తలు

Updated : 01/03/2021 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యార్థిని అత్యాచారం డ్రామా!

అడవిలో గాలిస్తున్న పోలీసులు

కార్వార(కర్ణాటక): హోంవర్క్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక అపహరణ, అత్యాచారం డ్రామాకు తెరతీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వైద్య పరీక్షల అనంతరం బాలిక చెబుతున్నవన్నీ అవాస్తవాలని వెల్లడికావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరకన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి బాలిక గత బుధవారం పాఠశాల నుంచి తిరిగిరాలేదు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి నందొళ్లి గ్రామానికి సమీపంలోని అడవిలో తాళ్లతో బంధించిన స్థితిలో బాలికను గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తనను ఎవరో ముగ్గురు దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. అయితే వైద్య పరీక్షల్లో అత్యాచారం జరగలేదని నిర్ధరణ అయింది. బాలికను గట్టిగా మందలించగా వాస్తవాలు చెప్పింది. హోంవర్క్‌ చేయనందున అపహరణ, అత్యాచార డ్రామాకు పాల్పడాల్సి వచ్చినట్లు వెల్లడించింది. యల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని