తాగుబోతుల విన్నపం..
close

తాజా వార్తలు

Updated : 15/03/2021 07:07 IST

తాగుబోతుల విన్నపం..

పాత బ్రాండ్ల మద్యం విక్రయించండి..

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్‌ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో వేసిన చీటీల్లో.. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో తదితరాలను తొలగించి పాత బ్రాండ్లు అయిన రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌ రకాల అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ తెల్ల కాగితం మీద ముద్రించిన చీటీలు లభ్యమయ్యాయి. పాత బ్రాండ్లు అమ్మకపోతే.. ఇదే తమ చివరి ఓటు అవుతుందని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని