ప్రపంచంలోనే నాలుగో పెద్ద సైనిక శక్తి.. భారత్‌!

తాజా వార్తలు

Updated : 22/03/2021 08:42 IST

ప్రపంచంలోనే నాలుగో పెద్ద సైనిక శక్తి.. భారత్‌!

మొదటిస్థానంలో చైనా
‘మిలటరీ డైరెక్ట్‌’ అధ్యయనం

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి చైనా వద్ద ఉందని ‘మిలటరీ డైరెక్ట్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని ఆదివారం విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. అమెరికా రెండో స్థానంలో ఉందని వివరించింది. మూడో స్థానంలో రష్యా నిలిచిందని పేర్కొంది. ఫ్రాన్స్‌కు ఐదు, బ్రిటన్‌కు 9వ స్థానాలు దక్కాయని తెలిపింది. చైనాకు 82, అమెరికాకు 74, రష్యాకు 69, భారత్‌కు 61, ఫ్రాన్స్‌కు 58, బ్రిటన్‌కు 43 పాయింట్లు లభించాయని వెల్లడించింది. రక్షణ బడ్జెట్లు, క్రియాశీల, రిజర్వు బలగాల సంఖ్య, వైమానిక, నౌకా శక్తి, అణ్వస్త్రాలు వంటి అంశాల ఆధారంగా సైనిక సామర్థ్యాన్ని లెక్కించినట్లు తాజా నివేదిక పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని