‘లేడి సింగం’ కేసులో అధికారి సస్పెన్షన్‌
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 07:32 IST

‘లేడి సింగం’ కేసులో అధికారి సస్పెన్షన్‌

ముంబయి: స్మగ్లింగ్‌ ఆట కట్టించి ‘లేడి సింగం’గా పేరు పొందిన అటవీశాఖ అధికారిణి దీపాళీ చవాన్‌ ఆత్మహత్య కేసులో... సీనియర్‌ ఐఎఫ్‌ఐ అధికారి, మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డిని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సస్పెండ్‌ చేసింది. ఈ కేసు విషయమై స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకుర్‌... ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వెంటనే ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ కన్జర్వేటర్‌ వినోద్‌ శివకుమార్‌ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా, పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అమరావతి జిల్లా మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు సమీపంలోని తన క్వార్టర్‌లో గత గురువారం దీపాళీ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు... ఆమె నాలుగు పేజీల లేఖ రాశారు. సీనియర్‌ అధికారి వినోద్‌ శివకుమార్‌ తనను లైంగికంగా వేధించారంటూ, తాను ఏ విధంగా చిత్రహింసలకు గురైంది పూసగుచ్చారు. ఉన్నతాధికారి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని