close

తాజా వార్తలు

Published : 08/04/2021 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘గాంధీ’లో మరో 200 ఆక్సిజన్‌ పడకలు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో అదనంగా మరో 200 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేసేందుకు పాలనా యంత్రాంగం నిర్ణయించింది. కరోనా రెండో దశ మొదలవగానే 200 ఐసీయూ పడకలను ప్రధాన భవనంలోని రెండో అంతస్తులో ఏర్పాటుచేశారు. కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుండడంతో మరో వంద పడకలను మూడో అంతస్తులో సమకూర్చారు. ప్రస్తుతం కరోనా అత్యవసర బాధితులనే చేర్చుకుంటున్నారు. ఇకపై వచ్చేవారికోసం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అమర్చే పడకల ఏర్పాటుకు ఉపక్రమించారు. ఇప్పటివరకు ఉన్న 300 పడకలన్నీ వెంటిలేటర్ల సౌకర్యమున్నవే కావడంతో, వాటిల్లోనే ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగులనూ ఉంచి వైద్యాన్నీ అందిస్తున్నారు. ఇటీవల పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ను మాత్రమే అందించేలా తాజాగా 200 పడకలను సమకూర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం అత్యవసర బాధితుల సంఖ్య 182కి చేరిందని సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. సుమారు 20 మంది బాధితులు బుధవారం మృత్యువాత పడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని