close

తాజా వార్తలు

Updated : 08/04/2021 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కృష్ణవరంలో వైకాపా వీరంగం..

తెదేపా నాయకురాలి ఇంటిపై దాడి ●

వాహనాలు, సామగ్రి ధ్వంసం

దాడిలో ధ్వంసమైన కుర్చీలు, కిటికీ అద్దాలు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణవరంలో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన తెదేపా నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బుదిరెడ్ల పుష్పరత్నం ఇంటిపై వైకాపా వర్గీయులు సుమారు 100 మందికి పైగా దాడికి పాల్పడ్డారు. పుష్పరత్నం ఇంటిపైకి రాడ్లు, కర్రలతో వచ్చి హల్‌చల్‌ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వారు ఇంటి ఆవరణలోని రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా బాధ్యుడు జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలానికి వచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు ఆరా తీశారు. అనంతరం చరవాణిలో ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ విషయమై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టించి గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ఈ దౌర్జన్యకాండకు తెగించారని ఆరోపించారు. గోపీనాథ్‌ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 150 మంది వైకాపా వారు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ముందే దౌర్జన్యం జరిగిందని ఆరోపించారు. పోలీసులు చెదరగొట్టారే తప్ఫ. ఎవరినీ అరెస్టు చేయలేదని నెహ్రూ ఆరోపించారు. ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలోకి దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని నెహ్రూ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన గోపీనాథ్‌ రాజకీయాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అనీ, అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని నెహ్రూ డిమాండ్‌ చేశారు.

 

ఇంటి ఆవరణలో రాళ్లు

వివరాలు ఆరా తీస్తున్న నెహ్రూ



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని