close

తాజా వార్తలు

Updated : 12/04/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతనో మధ్యవర్తి మాత్రమే

పోలీసులకు సవాల్‌గా మారిన ‘గసగసాల’ కేసు


పోలీసులు స్వాధీనం చేసుకున్న పంట

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారుల్లో పట్టుపడిన ‘గసగసాల(ఓపీఎం సీడ్స్‌)’ కేసు రాచకొండ పోలీసులకు సవాలుగా మారింది. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తెర వెనుకున్న ముఠా గుట్టు రట్టవుతుందని భావించారు. తీరా చూస్తేనేమో.. అతనో మధ్యవర్తి మాత్రమేనని తేలడంతో పరిస్థితి మొదటికొచ్చింది. సరకు నాణ్యతను బట్టి ఒక్కో కిలోపై రూ.5వేల వరకు కమీషన్‌ అందుతుందని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరికొచ్చే పంటను తీసుకెళ్తారని.. అక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో తెలియదంటూ చేతులెత్తేశాడు. ప్రతిసారి కొత్త వ్యక్తులొచ్చి డబ్బులు చెల్లించి సరకు తీసుకెళ్తారంటూ వివరించాడు. ఇప్పుడా ఆ వ్యక్తులెవరో తెలిస్తేనే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశముంది.
దీని నుంచే కొకైన్‌, హెరాయిన్‌
మొన్న గంజాయి.. నిన్న.. హాషీష్‌ ఆయిల్‌.. ఇప్పుడు నల్లమందు(గసగసాల)పై డ్రగ్స్‌ ముఠా దృష్టి సారించింది. ఈ మొక్కలు చూడటానికి అచ్చం గసగసాల మాదిరిగానే ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉండే కాయ పైభాగంలో సున్నితంగా గాటు పెడితే తెల్లటి ద్రవం కారుతుంది. కొంత సేపు ఆరబెడితే కాయలపైనే బంకలాగా గట్టిపడుతుంది. 24 గంటల తర్వాత కాయ ముదురు గోధుమ రంగంలోకి మారుతుంది. బంకలాగా మారిన ఆ తెల్లటి ద్రావణాన్ని ప్రత్యేక యంత్రాలతో జాగ్రత్తగా సేకరిస్తారు. అదే నల్లమందు. కొన్ని రసాయనాలను కలిపి కొకైన్‌, హెరాయిన్‌ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను తయారు చేస్తారు. అయితే.. ఈ గసగసాల సాగుపై నిషేధం అమల్లో ఉంది. పండించినా.. రవాణా చేసినా.. నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిప్‌ సబ్‌స్టెన్స్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం 1985 ప్రకారం నేరంగా పరిగణిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
అవగాహన లేక.. అంతరపంటగా
ఈ గసగసాల గురించి రైతులకు కనీస అవగాహన లేదు. ఇదే డ్రగ్స్‌ ముఠాలకు వరంగా మారింది. మీరు వేసే పంటల్లో అంతరపంటగా వేసుకోవచ్చంటూ బోల్తా కొట్టిస్తున్నారు. విత్తనాలను సరఫరా చేసి పంట పండిన తర్వాత పొలానికొచ్చి కిలోకు రూ.5వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహాలోనే రాచకొండ కమిషనరేట్‌ కందుకూరు ఠాణా పరిధిలోని లేమూరులో కౌలు రైతును బోల్తా కొట్టించారు. 20 ఎకరాల మామిడి, జామ తోటల్లో రూ.20 లక్షల విలువైన(390 కిలోల) గసగసాలను సాగు చేసిన దండుపల్లి చెన్నకేశవులు(కౌలు రైతు)ను అరెస్ట్‌ చేశారు. అంతకు మూడు రోజుల ముందే చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ ఇలాంటి తతంగమే వెలుగు చూడటంతో ‘గసగసాల’ సాగుపై విస్తృతంగా చర్చ నడిచింది. చెన్నకేశవులుకు విత్తనాలు అందించిన దిమ్మిరి వెంకటరమణను మదనపల్లి ఘటనలో అప్పటికే చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మదనపల్లి సబ్‌జైల్లో ఉన్న ప్రధాన సూత్రధారిని రాచకొండ పోలీసులు పీటీ వారెంట్‌పై మార్చి 30న అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. కోర్టు అనుమతితో కొన్ని రోజుల కిందట కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి విత్తనాలు వస్తాయని చెప్పాడు. పంట రెడీగా ఉందా..? అంటూ వాళ్లే ఫోన్‌ చేస్తారని వివరించారు. సిద్ధంగా ఉందని చెబితే రాత్రిపూట వచ్చి తీసుకెళ్తారని, అంతకు మించి తనకేం తెలియదంటూ తేల్చి చెప్పాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని