close

తాజా వార్తలు

Updated : 12/04/2021 07:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుమార్తె వివాహానికి దాచుకున్న సొత్తు చోరీ

వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

మార్టూరు, న్యూస్‌టుడే: కుమార్తె వివాహం కోసం కష్టపడి కూడబెట్టిన నగదు, ఆభరణాలను దొంగలు దోచుకెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దొంగతనం మార్టూరు పట్టణ పరిధిలోని రాయల్‌ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉండే చందోలు షేక్‌ ఖాజావలి ఇంట్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా అరటికాయల వ్యాపారం, టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఖాజావలి శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పర్చూరు మండలం ఉప్పుటూరులోని బంధువుల ఇంట వేడుకలకు వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో స్వగృహానికి చేరుకున్నారు. ఇంటి తాళం కోసి ఉన్నట్లు గుర్తించి, లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలోని సుమారు రూ.ఆరు లక్షల నగదు, మూడు సవర్ల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు మార్టూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఒంగోలు క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇంకొల్లు సీఐ ఆల్తాఫ్‌ హుస్సేన్‌ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని