Corona: ఒకే టీకాస్త్రం.. డోసు రూ.75కే!

తాజా వార్తలు

Updated : 22/04/2021 10:22 IST

Corona: ఒకే టీకాస్త్రం.. డోసు రూ.75కే!

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారికి ముకుతాడు వేసే సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌లతో పాటు భవిష్యత్తులో జన్యుక్రమాన్ని మార్చుకోవడం ద్వారా పుట్టుకొచ్చే కొత్తరకం వైరస్‌లనూ నిలువరించగల ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది. ఒక్కో డోసు కేవలం రూ.75కే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటం దీని మరో ప్రత్యేకత. సాధారణంగా ‘పోర్కైన్‌ ఎపిడమిక్‌ డయేరియా వైరస్‌ (పీఈడీవీ)’ అనే వైరస్‌ పందుల్లో డయేరియా, తీవ్ర జ్వరం తదితర ఇబ్బందులను సృష్టిస్తుంది. ఇది కూడా కరోనా కుటుంబానికి చెందిన వైరసే. తాజా పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు పీఈడీవీ, కొవిడ్‌ నివారణ టీకాలను అభివృద్ధి చేశారు. ఈ టీకాలూ.. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌లపై ఉండే ‘ఫ్యుజన్‌ పెప్టైడ్‌’లను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ను నిలువరించకున్నా.. వైరస్‌లపై పోరాటానికి రోగనిరోధక శక్తిని వేగంగా సన్నద్ధం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని