కరోనా సోకినా వైద్య సేవలోనే..
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 07:59 IST

కరోనా సోకినా వైద్య సేవలోనే..

గుజరాత్‌లో ఇద్దరు డాక్టర్ల గొప్ప మనసు

భావ్‌నగర్‌: తాము ఆపదలో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు గుజరాత్‌కు చెందిన ఇద్దరు వైద్యులు. భావ్‌నగర్‌లోని బజరంగ్‌దాస్‌ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ హిరేన్‌ కవా, డాక్టర్‌ భవేశ్‌ సోలంకిలకు కరోనా సోకింది. తీవ్ర అనారోగ్య లక్షణాలేవీ లేకపోవడంతో ఇంట్లోనో, మరో చోటో స్వీయం నిర్బంధంలో ఉండటానికి వారు ఇష్టపడలేదు. పీపీఈ కిట్లు ధరించి తమ ఆస్పత్రిలోనే కొవిడ్‌ బాధితుల వార్డులో ఉంటూ.. వారికి చికిత్స అందిస్తున్నారు. తద్వారా అటు రోగుల్లో, ఇటు వైద్య సిబ్బందిలో స్ఫూర్తి నింపుతున్నారు. బజరంగ్‌దాస్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని