కుక్కపై రాయి విసిరారని చితక్కొట్టారు!
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 07:11 IST

కుక్కపై రాయి విసిరారని చితక్కొట్టారు!


సుదర్శన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కుక్కపైకి రాయి విసిరారంటూ మొదలైన గొడవలో కొందరిపై పలువురు యువకులు దాడిచేశారు. ఇది నందినగర్‌ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్‌ నంబరు 14లోని నందినగర్‌లో నివసించే యువకులు సందీప్‌, మనోజ్‌ శనివారం రాత్రి బస్టాప్‌ నుంచి తాముండే గదికి వెళుతున్నారు. పక్కన ఖాళీ స్థలంలో సందీప్‌ మూత్ర విసర్జనకు వెళ్లాడు. స్థానికుడు శ్రీను పెంపుడు కుక్కలతో అటు వచ్చాడు. కుక్కలు మీదకు వస్తుండటంతో భయపడిన సందీప్‌ రాయి విసిరాడు. ఇది చూసి శ్రీను దుర్భాషలాడాడు. గొడవ ప్రారంభమైంది. కొందరు యువకులు శ్రీనుకు మద్దతుగా వచ్చి సందీప్‌, మనోజ్‌పై దాడికి పాల్పడ్డారు. బాధితులు స్నేహితులకు ఫోన్‌ చేయడంతో టీవీ పరిశ్రమలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసే బొబ్బిలి సుదర్శన్‌, కొరియోగ్రాఫర్‌ కందుకూరి అనిల్‌, ఆదిత్య, మరో ఇద్దరు చేరుకున్నారు. వీరిపైనా విచక్షణా రహితంగా దాడికి దిగారు. సుదర్శన్‌ తలకు బలమైన గాయమవ్వగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు, దాడికి పాల్పడినవారిగా అనుమానిస్తున్న అరుణ్‌, వెంకటేష్‌, నర్సింగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. బల్లు, రాహుల్‌తోపాటు మరికొందరి కోసం గాలిస్తున్నట్లు సీఐ పూసపాటి శివచంద్ర తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని