close

తాజా వార్తలు

Updated : 04/05/2021 08:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భగ్గుమన్న ప్రేమ వివాదం

 పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మిత్రులు


అంకమ్మరావు (పాత చిత్రం) 

మద్దిపాడు, న్యూస్‌టుడే: ప్రేమ వ్యవహారం మిత్రుల మధ్య విభేదాలకు దారి తీసింది. మనస్పర్థలు తలెత్తి ఓ యువకుని ప్రాణాల మీదకి తెచ్చింది. పరస్పరం గొడవ పడి పెట్రోల్‌ పోసుకుని కాల్చుకునే స్థాయికి వివాదం చేరింది. ఈ దుర్ఘటన మద్దిపాడు మండలంలోని నేలటూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నేలటూరుకు చెందిన యరజాని అంకమ్మరావు(20) బేల్దారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయమై అతని మిత్రులతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మధు, మరో ఇద్దరు యువకులు మద్యం తాగేందుకు అంకమ్మరావును ఆదివారం రాత్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. అనంతరం మిత్రులు అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలు తాళలేక పెద్దగా కేకలు వేస్తూ కాలుతున్న శరీరంతోనే అంకమ్మరావు రహదారిపై పరుగులు తీశాడు. గ్రామంలోకి వచ్చి చర్చి సమీపంలో పడిపోయాడు. విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు మంటలు ఆర్పి 108లో వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. మధుతో పాటు మరో ఇద్దరు యువకులు తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్టు అంకమ్మరావు వారికి తెలిపాడు. అనంతరం పోలీసులు గ్రామంలోనూ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.  


గ్రామంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని