ఎయిర్‌పోర్టులో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం!
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 09:21 IST

ఎయిర్‌పోర్టులో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం!

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ప్రొటోకాల్‌ ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడానికి మంత్రి బుగ్గన వీఐపీ గేటు వద్దకు రాగా భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

మంత్రి ప్రవేశించే ప్రయత్నం చేయగా బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకలేని పరిస్థితి నెలకొంది. తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను రాష్ట్ర మంత్రి కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్‌రెడ్డికి విమానాశ్రయ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో విమానాశ్రయంలో కొంత సమయం గందరగోళం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని