సంతాన సాఫల్యతకు టీకాతో ముప్పు లేదు
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 08:39 IST

సంతాన సాఫల్యతకు టీకాతో ముప్పు లేదు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: కరోనా టీకా తీసుకునే పురుషులు, మహిళలు వంధ్యత్వం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పునరుద్ఘాటించింది. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు.. మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఓ ప్రకటనలో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గతంలో పోలియో, మీజిల్స్‌-రుబెల్లా వ్యాక్సినేషన్‌ సమయంలోనూ ఇలాంటి వదంతులను ప్రచారం చేశారని తెలిపింది. టీకాలను తొలుత జంతువులపై, తర్వాత మనుషులపై ప్రయోగించి చూస్తారని.. సురక్షితం, భద్రం అని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతిస్తారని గుర్తుచేసింది. కొవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అవి సమర్థంగా పనిచేస్తున్నాయని తేల్చిచెప్పింది. అందుకే పాలిచ్చే తల్లులకూ టీకా ఇవ్వడానికి ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19 (నెగ్‌వ్యాక్‌)’ సిఫార్సు చేసినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని