AP News: వారికి 20 రోజుల ప్రత్యేక సెలవులు

తాజా వార్తలు

Published : 06/07/2021 07:57 IST

AP News: వారికి 20 రోజుల ప్రత్యేక సెలవులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొవిడ్‌ బారినపడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల వరకూ ప్రత్యేక సాధారణ సెలవులు(ఎస్‌సీఎల్‌) మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మార్చి 25 నుంచి ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో స్పష్టం చేసింది. మొత్తం 5 కేటగిరీలుగా విభజించి సెలవులు మంజూరు చేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. ఉద్యోగి కొవిడ్‌ బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉంటే 20 రోజుల వరకూ కమ్యూటెడ్‌ సెలవు ఇస్తారు. ఒకవేళ కమ్యూటెడ్‌ సెలవలు అందుబాటులో లేకుంటే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తారు. మిగతా ఐదు రోజుల్ని ఈఎల్‌, హెచ్‌పీఎల్‌ నుంచి సర్దుబాటు చేస్తారు. ఉద్యోగి కొవిడ్‌ బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే... పాజిటివ్‌ వచ్చిన నాటి నుంచి 20 రోజుల పాటు సెలవు ఇస్తారు. ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు లేదా కలిసి ఉంటున్న వారికి పాజిటివ్‌ వస్తే.. 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఉద్యోగి కాంటాక్టు అయ్యుండి హోం క్వారంటైన్‌లో ఉంటే.. ఏడు రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌గా పరిగణిస్తారు. కంటెయిన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో ఉండి క్వారంటైన్‌లో ఉంటే.. కంటెయిన్‌మెంట్‌ జోన్‌ డీ నోటిఫై చేసే వరకూ ఉద్యోగి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు పరిగణిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని