Crime News: హైదరాబాద్‌లో సహజీవన జంట పైశాచికత్వం!

తాజా వార్తలు

Updated : 30/07/2021 07:12 IST

Crime News: హైదరాబాద్‌లో సహజీవన జంట పైశాచికత్వం!

మహిళను హతమార్చిన వైనం


ఆభరణాలను పరిశీలిస్తున్న డీసీపీ పద్మజ, సీఐ రమణారెడ్డి

జీడిమెట్ల, న్యూస్‌టుడే: లేబర్‌ అడ్డాల వద్ద అందంగా, ఒంటరిగా బంగారం, వెండి ఆభరణాలతో ఉన్న మహిళలే లక్ష్యంగా నేరాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మల్లంపేటకు చెందిన ఓ పేద మహిళ(37) వీరి చేతికి చిక్కి ప్రాణాలు పొగొట్టుకొంది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్క హత్యతో వీరి నేర చరిత్ర మొత్తం బయటపడింది. గురువారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.

● సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం వైఎస్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న కురువ స్వామి అలియాస్‌ రవి, మసనమొల్ల నర్సమ్మ సహజీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కలిసి ఈ నెల 25న మల్లంపేట లేబర్‌ అడ్డాకు వెళ్లారు. పని కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మల్లంపేటకు చెందిన మహిళ(37) వారి కంట పడింది. అందంగా ఉండడంతో పాటు మెడలో ఆభరణాలు ఉండటంతో పరిచయం చేసుకున్నారు. ఆలయం వద్ద సున్నం వేయాల్సి ఉంటుందని, రూ.700 ఇస్తారని నమ్మించారు. దీంతో వారిని నమ్మి, ఆ మహిళ వారి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. జిన్నారం మండలం అంకిరాల గుట్టల్లోకి తీసుకెళ్లారు. ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించినా.. కొండపై ఆలయం ఉందని చెప్పారు. అక్కడికి వెళ్లాక స్వామి ఆమెను లోబర్చుకునే యత్నం చేశాడు. ఆమె భయాందోళనతో కేకలు వేసింది. నర్సమ్మ.. ఆ మహిళను కదలకుండా పట్టుకోవడంతో అతడు అత్యాచారం చేశాడు. అనంతరం కిరాతంగా కర్రతో జననాంగాలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. మెడలోని బంగారు, వెండి ఆభరణాలు తీసుకొని వెళ్లిపోయారు.

సీసీ కెమెరాలు పట్టించాయి..

పనికి వెళ్లిన తన భార్య ఇంటికి రాలేదని ఆమె భర్త దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మల్లంపేట లేబర్‌ అడ్డా నుంచి మహిళను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న ఫుటేజీ వెలుగుచూశాయి. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా గాగిల్లాపూర్‌ లేబర్‌ అడ్డా వద్ద వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దారుణాలు బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెలలోనే నాలుగు చోరీలు చేసినట్లు తేలింది. రూ.2 లక్షలు విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరాతక జంట దారుణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. వెలుగులోకి రాని ఘటనలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని