Crime News: బావతో కలిసి భర్తను అంతమొందించిన మహిళ

తాజా వార్తలు

Published : 30/07/2021 07:59 IST

Crime News: బావతో కలిసి భర్తను అంతమొందించిన మహిళ

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలాజీ..

కొండాపూర్‌, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు కారణమైన ఆటో, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపిన వివరాలు.. మల్కాపూర్‌కు చెందిన నాటుకారి రామలింగం(34)ను ఈ నెల 26న హత్యకు గురయ్యాడు. అతడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ, ఎస్సైలు ప్రత్యేక బృందంగా ఏర్పడి చరవాణి కాల్‌డేటా ఆధారంగా విచారణ చేయగా విస్తుగొలొపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామలింగం భార్య అనితకు బావ వరుసయ్యే భాస్కర్‌తో వివాహేతర సంబంధం ఉండగా, ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో రామలింగం భార్యతో గొడవపడి కల్పగూర్‌లో ఉంటోన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అదే సయమంలో అతడిని హత్య చేయాలని అనిత, భాస్కర్‌ నిర్ణయించుకొని ఈనెల 25న రాత్రి రామలింగంను నమ్మించి భాస్కర్‌ ఆటోలో మల్కాపూర్‌ శివారుకు తీసుకొచ్చి మద్యం తాగించి రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలగా నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును 48 గంటల్లో ఛేదించిన సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని