TS News: పాతిపెట్టిన శవాన్ని తీసి.. దారిపైనే పడేసి

తాజా వార్తలు

Updated : 01/08/2021 09:41 IST

TS News: పాతిపెట్టిన శవాన్ని తీసి.. దారిపైనే పడేసి

నల్గొండ జిల్లా కేతేపల్లిలో ఘటన


కేతేపల్లి: కొండకిందిగూడెంలో రహదారిపై వంగూరి బుచ్చమ్మ మృతదేహం డబ్బా

కేతేపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయ భూమి ఎదుట మృతదేహాన్ని పాతిపెట్టారనే కోపంతో శవాన్ని బయటకు తీసి రోడ్డుపై పడవేసిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకిందిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వంగూరి బుచ్చమ్మ(58) శుక్రవారం మృతిచెందింది. వంగూరి వంశానికి ఉమ్మడిగా ఉన్న భూమిలో వారి కుటుంబీకులు చనిపోయిన సందర్భంలో పూడ్చివేసి సమాధులు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వంశంలో సుమారుగా నలభై కుటుంబాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుచ్చమ్మ మృతదేహాన్ని శుక్రవారం ఉమ్మడి స్థలంలో సమాధి చేశారు. గుంత తీసే సమయంలోనే సమాధుల స్థలానికి పక్కన ఉన్న భూమి యజమాని వంగూరి చంద్రయ్య అభ్యంతరం తెలిపారు. తమ భూమి పక్కన శవాన్ని పెడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. అయితే మృతురాలు బుచ్చమ్మ భర్త ప్రకాశం సమాధి పక్కనే ఈమెను కూడా సమాధి చేస్తామని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబీకుల అభిప్రాయం ప్రకారం అక్కడే సమాధి చేశారు. దీంతో ఆగ్రహం చెందిన వంగూరి చంద్రయ్య, ఆయన భార్య రుక్కమ్మ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుచ్చమ్మను సమాధి చేసిన గుంతను తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి సమీపంలోని రహదారిపై పెట్టారు. ఈ విషయమై శనివారం మృతురాలి కుమార్తె శోభారాణి ఫిర్యాదు మేరకు నిందితులు వంగూరి చంద్రయ్య, ఆయన భార్య రుక్కమ్మ, కుమార్తె కవితలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థులు, పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పాతబొంద స్థలంలోనే బుచ్చమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

 

అంతిమ సంస్కారం చేసేందుకు ఏర్పాటు చేసిన గోతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని