AP News: వారానికో సంతకం..రూ.లక్షల్లో వేతనం

తాజా వార్తలు

Updated : 01/08/2021 09:23 IST

AP News: వారానికో సంతకం..రూ.లక్షల్లో వేతనం

● పరీక్షలు నిర్వహిస్తే ఒట్టు

● అలంకారప్రాయంగా ప్రాంతీయ ప్రయోగశాల


30వ తేదీన ఒక్కరి సంతకం తప్ప మిగిలినవారిదేదీ?

న్యూస్‌టుడే-కర్నూలు వైద్యాలయం : కర్నూలు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ ప్రయోగశాలను దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. వివిధ వైద్య పరీక్షలతోపాటు కొంతవరకు నీటి పరీక్షలకు ఉపయోగపడేది. 2009లో కర్నూలుకు వచ్చిన వరదలతో ఈ ల్యాబ్‌ మునిగిపోయింది. పరికరాలు పనికిరాకుండా పోయాయి. తర్వాత ప్రభుత్వం కొంతమేర నిధులు కేటాయించింది. ప్రస్తుతం ఇందులో ముగ్గురు వైద్యులు, ఇద్దరు అనాలసిస్ట్‌లు, ఒక అటెండరు, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. నిబంధనల ప్రకారం సిబ్బంది ఇక్కడే పరీక్షలు చేసి రోగులకు అవసరమైన సేవలు అందించాల్సి ఉండగా ఆ పరిస్థితి ఏమాత్రం కానరావడం లేదు.

ప్రభుత్వ ధరలతోనే..

కర్నూలు వైద్య కళాశాల ఆవరణలోని ప్రాంతీయ ప్రయోగశాలలో మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, 24 గంటల ల్యాబ్‌లో చేసే ఆర్‌ ఫ్యాక్టర్‌, ఏఎస్‌వో, సిరాలజీ పరీక్షలు, టీబీ పరీక్షలు తదితరాలు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నీటి పరీక్షలు, బోరు, బావిలోని నీరు ఉపయోగించుకునేందుకు పనికొస్తుందా? లేదా? తదితరాలు చేయాల్సి ఉంది. వీటిని సైతం ప్రభుత్వ నిర్ణయించిన ధరలతో చేయాలి. ప్రధానంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు సంబంధించి బయటకు రాసినప్పుడు వారికి తక్కువ ధరలతో చేసి ఫలితాలు ఇవ్వాలి. సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండాలి.

ఇంట్లో కూర్చొనే వేతనాలు

ప్రభుత్వ వైద్యశాలలో అవకాశం లేని పరీక్షలను రీజనల్‌ ప్రయోగశాలలకు రాసిస్తుంటారు. ఇక్కడి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు చివరికి ప్రైవేటు క్లినిక్‌లలో చేయించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సి రావడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోగశాల నిర్వహణ సైతం పట్టించుకోకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుతోంది. ఈ ల్యాబ్‌లో కనీసం విద్యుత్తు బల్బు లేదంటే వైద్య పరీక్షలు ఎలా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్ఛు మరోవైపు విధులకు హాజరుకాకనే ఎంచక్కా జీతాలు తీసుకుంటున్నారు.

క్లినిక్‌లు పెట్టుకుని..

ముగ్గురు వైద్యుల్లో డా.హిమబిందు, డా.వెంకటసుబ్బయ్యలు పీహెచ్‌సీలలో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగంలో ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తి ఇక్కడ డిప్యూటేషన్‌పై విధుల్లో ఉన్నారు. వీరిలో ఒక్కరే పాథాలజీ విభాగానికి చెందినవారు కాగా మిగిలిన ఇద్దరికి ల్యాబ్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా ఇక్కడే బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో పలువురు విధులకు హాజరుకాకుండా బయట క్లినిక్‌లు నిర్వహిస్తుండటం గమనార్హం. అప్పుడప్పుడు వచ్చి రిజిస్టరులో సంతకాలు చేసేసి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం - డాక్టర్‌ మంజరి, రాష్ట్రీయ సంచాలకులు, అమరావతి

ప్రాంతీయ ప్రయోగశాలలో ముగ్గురు వైద్యులు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వారు అక్కడ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని అక్కడికొచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

వైద్య కళాశాల ఆవరణలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాంతీయ ప్రయోగశాల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని