Crime News: ఒక్క మాటకు నిండు ప్రాణం బలైపోయింది..

తాజా వార్తలు

Updated : 01/08/2021 09:50 IST

Crime News: ఒక్క మాటకు నిండు ప్రాణం బలైపోయింది..

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

యానాం: ఓ బాలుడి జుట్టుపై చేసిన వ్యాఖ్య ఒక వ్యక్తి హత్యకు దారితీసిందని యానాం ఇన్‌ఛార్జి ఎస్పీ గూటం శివగణేష్‌ చెప్పారు. సర్కిల్‌ కార్యాలయంలో శనివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న యానాం హైవేలోని ఓ దుకాణం వద్ద రాజమహేంద్రవరం గ్రామీణం రాజవోలుకు చెందిన పట్నాల చినసత్యనారాయణ, పంపన సుబ్బారావు, కేదగిరి మణికంఠ, పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరానికి చెందిన రోహిత్‌, ఓ బాలుడు(17) కలిసి మద్యం తాగుతున్నారు. అక్కడికి ఐ.పోలవరం మండలం పెదమడికికి చెందిన లంక రాజబాబు, పాత ఇంజరం గ్రామానికి చెందిన కాశీ శ్రీనివాసరావు వచ్చారు. ఈ నేపథ్యంలో మద్యం తాగుతున్న బాలుడి జుట్టుపై రాజబాబు శ్రీనివాసరావుతో వ్యాఖ్యానాలు చేశాడు. దీంతో వివాదం చెలరేగి పట్నాల చినసత్యనారాయణ తొలుత బీర్‌ సీసాతో రాజబాబుపై దాడిచేశాడు. అనంతరం కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ప్రతిఘటించిన కాశి శ్రీనివాసరావును సైతం గాయపరిచారు. ఈ ఘటనలో రాజబాబు(25) మృతిచెందగా, మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసరావును కాకినాడ తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని