Cyberabad Police: ఒక్క చలానాకే ద్విచక్ర వాహనం సీజ్‌

తాజా వార్తలు

Published : 02/08/2021 08:05 IST

Cyberabad Police: ఒక్క చలానాకే ద్విచక్ర వాహనం సీజ్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఒక్క చలానా పెండింగ్‌ ఉందని మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ తొగరి బైకును ఆదివారం పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్‌ కోరారు. అది తప్పుడు చలానా అని న్యాయవాది బదులిచ్చారు. బండిని సీజ్‌ చేయగా, ఒక్క చలానాకే ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. మాదాపూర్‌ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఒక్క చలానా పెండింగ్‌ ఉన్నా సీజ్‌ చేయొచ్చని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని