AP News: టీకా వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 19/08/2021 10:04 IST

AP News: టీకా వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు


మృతిచెందిన దేవశ్రీ

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: ఏడాదిన్నర చిన్నారి టీకా వేసిన కొద్దిసేపట్లోనే మృతి చెందడం మాచర్లలో ఆందోళనకు దారి తీసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, న్యాయం చేయాలని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో బైఠాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన జూపల్లి నాగరాజు, అనూష కుమార్తె దేవశ్రీకి బుధవారం మండాది సచివాలయంలో ఆరోగ్య కార్యకర్త డీపీటీ, మీజిల్స్‌, రుబెల్లా టీకాను వేశారు. ఒకవేళ జ్వరం వస్తే పారాసిట్మల్‌ మాత్ర సగం వేయమని ఆరోగ్య కార్యకర్త చెప్పారు. టీకా వేసిన కొద్దిసేపటికి తల్లి అనూష చిన్నారి దేవశ్రీకి మాత్ర వేసింది. ఏం జరిగిందో.. తెలీయదు.. అంతే తల్లి ఒడిలోనే చిన్నారి వాలిపోతుండటంతో ఆందోళనకు గురైన తల్లి, బంధువులు హుటాహుటీన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో చిన్నారి బంధువులు ఆస్పత్రి ఆవరణలోనే దేవశ్రీ మృతదేహంతో భైఠాయించారు. తమ చిన్నారి మృతికి ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి, ఆస్పత్రి సూపరిండెంట్‌ బీవీరంగారావు, వైద్యులు శివరాంప్రసాద్‌ కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. నిజాలు తేల్చేందుకు చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించి పంచనామా నిర్వహించారు. పంచనామా నివేదిక ఆధారంగా చిన్నారి మృతికి కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. టీకా వేసినప్పుడు పాప బాగానే ఉందని, సగం మాత్ర వేయమని తమ ఆరోగ్య కార్యకర్త తల్లికి చెప్పిందని ఉప్పలపాడు పీహెచ్‌సీ వైద్యులు శ్రీరామ్‌ చెప్పారు. ఈక్రమంలో మాత్ర గొంతుకు అడ్డుపడటం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఏమైనా మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని