Cash Deposit: ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు

తాజా వార్తలు

Updated : 17/09/2021 07:37 IST

Cash Deposit: ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు

పట్నా: విద్యార్థుల బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం ఉంటుంది? రూ.పదివేలో లేక రూ.ఇరవై వేలో ఉంటుందని భావిస్తాం కదా? అలాంటిది బిహార్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థుల ఖాతాల్లో ఏకంగా రూ.960 కోట్లు జమయ్యాయి. కటిహార్‌ జిల్లా బగౌరా పంచాయతీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు.. గురుచంద్ర విశ్వాస్‌, అసిత్‌ కుమార్‌లకు ఉత్తర్‌ బిహార్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. పాఠశాల ఏకరూప దుస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో? లేదో? తెలుసుకోవాలని వారు భావించారు. సమీపంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కేంద్రీకృత ప్రాసెసింగ్‌ కేంద్రానికి వెళ్లి ఖాతాలోని నిల్వ మొత్తం తనిఖీ చేయించారు. అనంతరం తమ ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. విశ్వాస్‌ ఖాతాలో రూ.60 కోట్లు, అసిత్‌ కుమార్‌ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి. ఈ సంఘటనపై బ్రాంచ్‌ మేనేజర్‌ మనోజ్‌ గుప్తా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఇద్దరి ఖాతాలను నిలిపివేసి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బిహార్‌కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల పొరపాటున రూ.5.5 లక్షలు జమవగా, తనకు ప్రధాని మోదీ ఇచ్చారంటూ వెనక్కి ఇచ్చేందుకు అతను నిరాకరించాడు. దానిని మరువక ముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని