Disha Case: ఎన్‌కౌంటర్‌ తర్వాత నా మానసిక స్థితి బాగాలేదు

తాజా వార్తలు

Published : 26/10/2021 08:08 IST

Disha Case: ఎన్‌కౌంటర్‌ తర్వాత నా మానసిక స్థితి బాగాలేదు

తదనంతర వివరాలు సరిగా నమోదు చేయలేకపోయా
సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట ఏసీపీ సురేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత మానసిక స్థితి బాగాలేక, తదనంతర వివరాలు సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ వెల్లడించారు. దిశ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట సోమవారం ఆయన హాజరయ్యారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాలు లాక్కొన్నారని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపడంతోనే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని సురేందర్‌ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎన్‌కౌంటర్‌ కేసు నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో కానీ, తర్వాత దాఖలు చేసిన అఫిడవిట్‌లో కానీ నిందితులు మట్టి చల్లినట్లు, కాల్పులు జరిపినట్లు ఎందుకు పేర్కొనలేదని కమిషన్‌ ప్రశ్నించింది. ఆ ఎన్‌కౌంటర్‌ తర్వాత తన మానసికస్థితి బాగాలేకే వాటిని పేర్కొనలేకపోయానని ఏసీపీ చెప్పారు. ముందు ఎవరు మట్టి చల్లారు? ఎవరెవరి కళ్లలో మట్టి పడింది? ఎవరు కాల్పులు జరిపారని కమిషన్‌ ప్రశ్నించగా.. చీకటిగా ఉండటంతో సరిగా చూడలేకపోయామని ఆయన బదులిచ్చారు. ‘‘నిందితులను భయపెట్టే ఉద్దేశంతో కాల్పులు జరపమని నా సిబ్బందికి ఆదేశాలు జారీచేశా. బృందంలోని లాల్‌మదార్‌ తొలుత కాల్పులు జరిపాడు. మాతోపాటు సాక్షులూ ఉన్నారు. వారిని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే శబ్దం వస్తున్న దిశగా కాల్పులు జరపమని చెప్పా’’ అని సురేందర్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని