close

తాజా వార్తలు

Published : 26/03/2020 07:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పించుకునేందుకు ఎన్ని కారణాలో..

తమవారు కనిపించడంలేదని ఒకరు.. రక్తదానానికంటూ ఇంకొకరు
ఆకతాయిల తీరుతో అవాక్కవుతున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నా రోడ్డుపైకి ఎందుకొస్తున్నారు..? అంటూ ప్రశ్నిస్తే ఆకతాయిలు చెప్పే సమాధానాలు విని పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకోసారి రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించి తిప్పి పంపుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్డెక్కొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నా చాలా మంది నగరవాసులు వినడంలేదు. దీంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడికెళ్తున్నారంటూ వాహనదారుల్ని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్‌ చౌరస్తా దగ్గర రాచకొండ పోలీసులు ఓ ద్విచక్రవాహనాన్ని ఆపారు. ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు ఫోన్‌ తీసి ఒక ఫొటో చూపించారు. ఈ ఫొటోలో వ్యక్తి కనిపించడం లేదని, అతని కోసమే వెతుకుతున్నామంటూ వివరించారు. నిజమేనని భావించిన పోలీసులు ఆ వ్యక్తి వివరాలను సేకరించారు. అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఆ ఇద్దరి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని లాంగ్‌ డ్రైవ్‌కు వచ్చామంటూ సమాధానమివ్వడంతో కంగుతిన్నారు. హైటెక్‌ సిటీలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యవసరంగా రక్తదానం చేసేందుకు ఆసుపత్రికి వెళ్తున్నామంటూ అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు తెలిపారు. గట్టిగా ప్రశ్నిస్తే స్నేహితుడి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్నామని చెప్పారు. మరోచోట కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు.. బిల్లు కట్టేందుకు డబ్బులు నా వద్దే ఉన్నాయంటూ మస్కా కొట్టే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇలా ఆకతాయిలు రకరకాల కారణాలతో తప్పించుకొనేందుకు యత్నిస్తుండటంతో అత్యవసరంగా వెళ్లేవారిని కూడా ఒకటికి.. రెండుసార్లు ప్రశ్నించాల్సి వస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని