పిల్లల ప్రేమ.. పెద్దల మారణహోమం
close

తాజా వార్తలు

Published : 12/07/2020 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల ప్రేమ.. పెద్దల మారణహోమం

కర్ణాటకలో ఒకే కుటుంబంలో అయిదుగురి దారుణ హత్య

సింధనూరు, న్యూస్‌టుడే: పెద్దలకు నచ్చని పిల్లల ప్రేమ ఓ కుటుంబానికి మరణ శాసనం రాసింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు  జిల్లా సింధనూరులోని సుక్కాలపేటలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణ హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం... స్థానికంగా ఒకే వీధిలో ఉంటున్న ఈరప్ప కొడుకు, ఫకీరప్పల కూతురు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారంపై ఇరుకుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం 3 గంటల సమయంలో యువతీ, యువకులిద్దరూ వీధిలో జంటగా కనిపించడంతో గొడవలు మొదలయ్యాయి. సాయంత్రం 5 గంటల సమయంలో యువతి తరఫు వారు ఆడామగా కలిసి ఏడుగురు ఆగ్రహంతో ఊగిపోతూ... కొడవళ్లు, కత్తులతో యువకుడి కుటుంబంపై దాడికి దిగారు. భయాందోళనకు గురైన ప్రేమజంట పోలీస్‌ స్టేషన్‌కు పరుగు తీసింది. అంతలోనే ఉన్మాదులు మారణహోమం సృష్టించారు. గొంతులు తెగిపోయి నాగరాజ్‌(38), సుమిత్రమ్మ(55), శ్రీదేవి(30), హనుమేశ్‌(40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దారుణం జరిగిపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న ఈరప్ప(60)ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రేవతి, తాయమ్మలను రాయచూరు తరలించారు. కేసు నమోదు చేసి, ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు సింధనూరు పట్టణ పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని