close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 08:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలాంటి.. ఉద్యోగాలూ ఉంటాయా?

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : బాగా చదువుకున్నాడు.. ‘అలాంటి’ ఉద్యోగం ఉందని చెబితే ఆశగా వెళ్లాడు. చివరికి.. కరోనా కష్టకాలంలో ఉన్నదంతా పోగొట్టుకుని చివరికి సైబర్‌ ఠాణా మెట్లెక్కి లబోదిబోమన్న ఓ టెకీ గాథ ఇదీ. ఉపాధి కల్పిస్తామని నమ్మబలికిన సైబర్‌ నేరగాళ్లు ఓ టెకీని మోసగించి రూ.83,500 డబ్బు కాజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఉద్యోగం పోయింది. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పలుచోట్ల ఆరాతీశాడు. అందుకోసం అంతర్జాలంపై ఆధారపడ్డాడు. ఉపాధి కోసం ఓ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యాక చరవాణి సంఖ్యను నమోదు చేసుకున్నాడు. టెకీ చరవాణికి ఓ రోజు ఫోన్‌ వచ్చింది. డబ్బున్న మహిళల ‘అవసరాలు’ తీర్చాలని- వారితో ‘అలా’ చేసి సంతృప్తిపరిస్తే బాగా డబ్బులు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు నమ్మబలికారు. పాపం.. టెకీ ఇదేదో బాగానే ఉందని ‘సరసాల పనికి సరే’నన్నాడు. రూ.1009 చెల్లించి పేరు నమోదు చేసుకున్నాడు. ఆ అద్భుత ఉపాధి చూపుతున్నందుకు నిర్వాహక సంస్థకు సభ్యత్వ రుసుముగా రూ.12,500 కట్టేశాడు. ఆ ఉద్యోగంలో ప్రవేశించే ముందు భద్రత, ఇతర రుసుములంటూ మరో రూ.70 వేలు గుంజుకున్నారు. ఇక చెల్లించడానికి ఏమీలేదని- ఉద్యోగంలో చేరిపోతానని ఆ నిరుద్యోగి వెంటపడడం ప్రారంభించాడు. అంతటితో.. ఖేల్‌ ఖతం.. దుకాణం బంద్‌! ఆ ఉద్యోగ కల్పన కేంద్రం నుంచి స్పందన నాస్తీ. ఇన్నాళ్లూ మాట్లాడిన చరవాణులన్నీ పనిచేయడం మానేశాయి. మోసపోయానని ఆ టెకీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చివరికి.. చేసేదేమీలేక ఆయన నగర సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.