close

తాజా వార్తలు

Published : 05/07/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పకు మోదీ మెప్పు

కరోనాపై ప్రధాని సూచనలు ఆలకిస్తున్న యడియూరప్ప,

నళిన్‌కుమార్‌ కటిల్‌, మంత్రులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : లాక్‌డౌన్‌ సందర్భంలో భాజపా చేపట్టిన సేవా కార్యక్రమాలు, వలస కార్మికుల తరలింపు కోసం తీసుకున్న జాగ్రత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సంయుక్తంగా కర్ణాటక ప్రభుత్వాన్ని అభినందించారు. సేవా అభియాన్‌ పేరిట భాజపా ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటిల్‌, ఇతర ప్రముఖ నేతలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. రానున్న కొద్ది నెలలు తాము తీసుకోనున్న చర్యలను ఎమ్మెల్సీ రవికుమార్‌ ప్రధానికి వివరించారు. కర్ణాటకతో పాటు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ఈ వర్చువల్‌ సభలు జరిగాయి. సేవా యోధులకు అందిస్తున్న పీపీఈ కిట్లు, రోగులకు చికిత్సలు, క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుపై ప్రధాని ఆరా తీశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటిల్‌, ఉప ముఖ్యమంత్రులు గోవింద కారజోళ, లక్ష్మణ సవది, అశ్వత్థ నారాయణ, మంత్రులు జగదీశ్‌ శెట్టర్‌, ఆర్‌.అశోక్‌, పార్టీ నాయకులు నిర్మల్‌ కుమార్‌ సురానా, శోభా కరంద్లాజె, సురేశ్‌ అంగడి, అరవింద లింబావళి, మహేశ్‌ తంగినకాయి తదితరులు పాల్గొన్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని