
తాజా వార్తలు
మేస్త్రీలను విమానంలో రప్పించిన నిర్మాణ సంస్థ
మంగళూరు, న్యూస్టుడే : ముగింపు దశలో ఉన్న నిర్మాణాల్ని పూర్తి చేయించేందుకు నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ మేస్త్రీలను విమానంలో రప్పించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన నవీన్ కర్డోజ అనే బిల్డర్ ఒకరు ఏడుగురు మేస్త్రీలను పశ్చిమ్ బంగా నుంచి విమానంలో రప్పించారు. ఇందుకు ఆయన ఒక్కొక్క మేస్త్రీకి రూ.7,500 వరకు వ్యయం చేశారట. కరోనా కారణంగా ఆంక్షలున్నందున వివిధ రాష్ట్రాల మీదుగా బస్సులో రావాలంటే ఆయా రాష్ట్రాల అనుమతులు అవసరమని అందుకే విమానంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. కరోనా వల్ల కార్మికులంతా తమ సొంతూళ్లకు వెళ్లడంతో ముగింపు దశలోని నిర్మాణాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే త్వరలోనే మరో 70 మందిని రప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
Tags :