close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శీతల గిడ్డంగుల్లోనూ మిర్చి లావాదేవీలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: శీతల గిడ్డంగుల్లోనూ మిర్చి లావాదేవీలను జరపాలని నిర్ణయించినట్లు మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగరి ఏసురత్నం, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. మిర్చి వ్యాపారులు, శీతలగిడ్డంగుల అసోసియేషన్‌ నాయకులతో మంగళవారం ఏసురత్నం, వెంకటేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న మిర్చి వెలుపలకు తీయడంలో ఉన్న ఇబ్బందులు, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా క్రయవిక్రయాలు ఏవిధంగా నిర్వహించాలి, తూకం ఎక్కడ వేయాలి, మరమ్మతులు ఎక్కడ నిర్వహించాలి, రంగులు పూయడం తదితర అంశాలపై చర్చించారు. ఏసురత్నం మాట్లాడుతూ మిర్చియార్డుతో పాటు శీతల గిడ్డంగుల్లోనూ మిర్చి క్రయవిక్రయాలు నిర్వహించేలా అనుమతి ఇచ్చామన్నారు. రైతులు తమ సరకు అమ్ముకునేందుకు కోల్డ్‌స్టోరేజ్‌ల్లో మచ్చు చూపించుకోవచ్చని, కొనుగోళ్లు పూర్తయిన వెంటనే ఎగుమతి వ్యాపారులు బస్తాలను తూకం వేసుకుని అక్కడి నుంచి తరలించుకోవాలని సూచించారు. ఎగుమతి వ్యాపారులు కొనుగోలు చేసిన సరకు మరమ్మతులు, రంగులు పూయడం వారి గోదాముల్లో నిర్వహించుకోవాలన్నారు. ఈమేరకు వ్యాపారులు, శీతల గిడ్డంగుల నిర్వాహకుల మధ్య ఒప్పందం కుదిరిందని కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా లైసెన్సులను హోల్డ్‌లో పెట్టేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని