
తాజా వార్తలు
నిషేధిత వస్తువులు విక్రయిస్తే దుకాణాల సీజ్
నరసరావుపేట పట్టణం: పురపాలక సంఘం పరిధిలో తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, విక్రయాలపై నిషేధం విధించామని.. ఎవరైనా వీటిని అమ్మితే దుకాణాలు సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని పురప్చాక కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణాల్లో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. నిషేధిత వస్తువులను గుర్తించి సీజ్ చేసి వ్యాపారులకు రూ.39 వేల జరిమానా విధించారు. టీపీవో సాంబయ్య, టీపీఎస్ అనురాధ, ఆర్వో మహేష్‌కుమార్, శానిటిరీ సూపర్వైజరు విజయసారథి పాల్గొన్నారు.
Tags :