close

తాజా వార్తలు

Published : 25/09/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షూటింగ్‌ వేళ.. సుధాకర్‌ కన్నుమూత

 రాక్‌లైన్‌ సుధాకర్‌ (పాతచిత్రం) 

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : సీనియర్‌ సహాయ నటుడు రాక్‌లైన్‌ సుధాకర్‌ (64) హఠాన్మరణం చెందారు. గురువారం బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులో ఆయన ఓ  సినిమా చిత్రీకరణలో మేకప్‌ చేసుకునే సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌తో సన్నిహితంగా ఉండేవారు. ఈ కారణంగానే ఆయన రాక్‌లైన్‌ సుధాకర్‌ అనే పేరు స్థిరపడింది. ఇప్పటి వరకు ఆయన 120కి పైగా సినిమాల్లో సహాయనటుడిగా నటించారు. గత నెలలో ఆయనను కరోనా పీడించింది. ఆ మహమ్మారిపై ఆయన విజయం సాధించారు. పూర్తిగా కోలుకున్నందునే సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని సన్నిహితులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.