పరీక్ష డుమ్మాకొట్టేందుకు బాలుడి కిడ్నాప్‌..!
close

తాజా వార్తలు

Published : 03/03/2020 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరీక్ష డుమ్మాకొట్టేందుకు బాలుడి కిడ్నాప్‌..!

మొరేనా(మధ్యప్రదేశ్‌): పరీక్ష రాయలేక ఎలాగైనా గైర్హాజరు కావాలనుకుని ఓ యువకుడు పన్నిన పన్నాగం ఓ బాలుడిని అపహరించి ఇబ్బందుల పాల్జేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాకు చెందిన 18ఏళ్ల రన్భీర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అయితే మంగళవారం జరుగనున్న వార్షిక పరీక్షకు ఎలాగైనా గైర్హాజరు కావాలని ఓ పథకం వేశాడు. తనరు సోదరుడు వరుసయ్యే మూడేళ్ల బాలుడిని నిద్రిస్తున్న సమయంలో అపహరించేందుకు(కిడ్నాప్‌)చేసి తాడుతో బంధించాడు. అనంతరం బాలున్ని తీసుకెళ్లి తన నివాసానికి కొంత దూరంలో ఉన్న పంటపొలాల్లో వదిలేసి వచ్చాడు. కొద్దిసేపటికి తన చిన్నారి కనిపించడం లేదని గుర్తించిన తల్లి, పరిసర ప్రాంతాల్లో గాలించింది. చిన్నారి ఆచూకీ ఎక్కడా దొరక్కపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఓ కాగితాన్ని గుర్తించారు. ఆ కాగితంపై చిన్నారిని వెతకడానికి రన్భీర్‌ను పంపించాలి అని రాసి ఉంది. దీంతో అనుమానించిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిజం ఒప్పుకున్న యువకుడు.. బాలుడిని వదిలిపెట్టిన స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడే పడిఉన్న బాలుడిని రక్షించిన పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేవలం చిన్నారి కోసం వెతుకుతూ పరీక్షకు గైర్హాజరు కావచ్చనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌ చేసినట్లు  యువకుడు అంగీకరించాడని  జిల్లా ఎస్‌పీ అసిత్‌ యాదవ్‌ వెల్లడించారు.  
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని