కచ్చితంగా వచ్చే ఏడాదిలోనే టోక్యో ఒలింపిక్స్‌
close

తాజా వార్తలు

Published : 02/05/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కచ్చితంగా వచ్చే ఏడాదిలోనే టోక్యో ఒలింపిక్స్‌

ఐఓసీ సభ్యుడు నరీందర్‌ బాత్రా

న్యూదిల్లీ: గతంలో నిర్ణయించినట్లుగా కచ్చితంగా వచ్చే ఏడాదిలోనే టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయని ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) సభ్యుడు, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా వెల్లడించారు. శనివారం భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో భాగంగా ఆయన ఈ మేరకు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జులైలో ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టని పక్షంలో వచ్చే ఏడాదీ ఒలింపిక్స్‌ నిర్వహించడం కష్టమేనని ఇటీవల పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బాత్రా మాట్లాడుతూ.. ‘నేను విశ్వసనీయ వర్గాలతో తరచూ మాట్లాడుతున్నాను. ముఖ్యమైన క్రీడావేదికలతోనూ టచ్‌లో ఉన్నాను. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో కరోనాకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి ఒలింపిక్స్‌ జరుగుతాయనే భావించి.. దానికి తగ్గట్లు మన దేశం ప్రణాళికలు రూపొందించుకోవాలి’ అని అన్నారు. మరో ఐఓసీ సభ్యుడు, ఆస్ట్రేలియాకు చెందిన జాన్ కోట్స్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్ కనిపెడితేనే ఒలింపిక్స్‌ నిర్వహణ సాధ్యమన్న వార్తలను విభేదించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని