తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి

గాంధీలోనూ ముగ్గురిలో లక్షణాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మ్యుకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)తో ఒక వ్యక్తి మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. మరికొందరు ఈ తరహా లక్షణాలతో చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్‌ జిల్లా బైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. సంబంధిత వైద్య వర్గాలు మాత్రం నిర్ధారించట్లేదు. ఇటీవల ప్రైవేటు ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరారు. వైద్యులు వారిలో బ్లాక్‌ ఫంగస్‌ గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉంది. సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనికితోడు ఆక్సిజన్‌ స్థాయి తగ్గిన వారికి స్టిరాయిడ్స్‌ అందిస్తుంటారు. అవి వ్యాధి నిరోధకశక్తిపై కొంత ప్రభావం చూపుతాయి. దానికి మధుమేహం తోడైతే.. బ్లాక్‌ఫంగస్‌ వచ్చే అవకాశం ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అందరికీ రాదు.. ఆందోళన వద్దు

బ్లాక్‌ఫంగస్‌ కొత్తది కాదు. తొలి దశలో కూడా గాంధీలో చికిత్స పొందిన 10 మంది కరోనా రోగుల్లో దీనిని గుర్తించాం. ఒకరిద్దరు తప్ప.. అందరూ చికిత్సతో కోలుకున్నారు. కరోనా రోగులందరికీ ఇది రాదు. గాంధీలో ప్రస్తుతం ముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించాయి. వారు కరోనాతోపాటు మధుమేహంతో చాలా రోజులుగా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇక్కడకు వచ్చారు. కరోనా తగ్గడానికి స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్‌ బారిన పడతారనేది వాస్తవంకాదు.

-డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని