close

తాజా వార్తలు

Updated : 16/09/2020 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిశ్శబ్దంగా కమ్మేస్తోన్న కరోనా

ఎలాంటి లక్షణాల్లేని వారు 70%
కొత్తగా 2058 కొవిడ్‌ కేసులు
మరో 10 మరణాలు
1.60 లక్షలకు పెరిగిన బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా కమ్మేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం కొత్తగా 2058 కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌(1,60,571)ల్లో ఎలాంటి లక్షణాల్లేకుండా కరోనాగా నిర్ధారణ అయినవారు 1,12,400.. అంటే 70 శాతం మంది ఉండటం గమనార్హం. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో కొవిడ్‌గా తేలినవారు 48,171(30 శాతం) మంది ఉన్నారు. ఈ నెల 14వతేదీ రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం(15న) విడుదల చేసింది.  సోమవారం 51,247 నమూనాలను పరీక్షించగా, వీటిలో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 22,548(44శాతం) మంది, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 6,149(12శాతం) మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం పరీక్షల సంఖ్య 22,20,586కు పెరిగింది. మరో 908 నమూనాల ఫలితాలు ఇంకా వెల్లడవ్వాల్సి ఉందని వైద్యశాఖ తెలిపింది.
80.45 శాతం కోలుకున్నోళ్లు
సోమవారం మరో 2,180 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారినవారి సంఖ్య 1,29,187కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారు 80.45 శాతంగా నమోదు కాగా, ఈ విషయంలో జాతీయ సగటు 78.26 శాతం. తాజాగా మరో 10 మంది కొవిడ్‌తో కన్నుమూయగా, మొత్తంగా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 984కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా, వీరిలో ఐసొలేషన్లలో వైద్యసేవలు పొందుతున్నవారు 23,534 మంది ఉన్నారు.
ఆరు జిల్లాల్లో 100కి పైగా..
సోమవారం నాటి ఫలితాల్లో 6 జిల్లాల్లో 100కిపైగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌)లో 277 పాజిటివ్‌లను నిర్ధారించగా, రంగారెడ్డి(143), కరీంనగర్‌(135), వరంగల్‌ నగర(108), సిద్దిపేట(106), ఖమ్మం(103) జిల్లాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 50 పాజిటివ్‌లు నిర్ధారించిన వాటిలో మేడ్చల్‌ మల్కాజిగిరి(97), నల్గొండ(96), నిజామాబాద్‌(84), భద్రాద్రి కొత్తగూడెం(75), మహబూబాబాద్‌(68),  సూర్యాపేట(62), యాదాద్రి భువనగిరి(53), జగిత్యాల(52) జిల్లాలున్నాయి.
హోం ఐసొలేషన్‌లో బండి సంజయ్‌
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లిన భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ హోంఐసొలేషన్‌లో ఉన్నారు. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌కు కరోనా సోకడంతో సంజయ్‌ ముందుజాగ్రత్తగా సమావేశాలకు వెళ్లకుండా దిల్లీలో నివాసానికి పరిమితమయ్యారు. గతవారం హైదరాబాద్‌కు వచ్చిన కృష్ణదాస్‌తో పార్టీ కార్యాలయంలో రెండురోజులు పాటు సంజయ్‌ సమావేశమయ్యారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కొద్దిసేపు ఆ భేటీలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం, సోమవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా సంజయ్‌కు నెగటివ్‌ వచ్చింది. తనకు పాజిటివ్‌ వచ్చినట్లు కృష్ణదాస్‌ ఫోన్‌ చేసి చెప్పడంతో సంజయ్‌ హోంఐసొలేషన్‌కు వెళ్లారు. మురళీధర్‌రావు, లక్ష్మణ్‌ కూడా హోంఐసొలేషన్‌లో ఉన్నారు. మరోపక్క పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డికి కరోనా సోకింది.


ఏపీలో 8,846 కరోనా కేసులు.. 69 మరణాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 70,511 పరీక్షలు నిర్వహించగా... 8,846 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్‌ బారినపడి 69 మôది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,041కి చేరింది. మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 5,83,925కి చేరాయి.
* కర్ణాటకలో మంగళవారం మరో 7,576 కరోనా కేసులు గుర్తించారు. మరో 97 మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 7,481కు పెరిగింది.
* తమిళనాడులో మంగళవారం 68 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 8,502కు పెరిగింది. తాజాగా 5,697 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.