Corona: బెడ్‌ కోసం 9 గంటలు కారులోనే..
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 07:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: బెడ్‌ కోసం 9 గంటలు కారులోనే..

గాంధీలోనూ దొరకని వెంటిలేటర్‌!  
రంజాన్‌ ముందు రోజు మసీదు పెద్ద కన్నుమూత

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: వెంటిలేటర్‌ బెడ్‌ కోసం బుధవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కారులో తిరుగుతూ ఎన్ని ఆసుపత్రులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. బుధవారం రాత్రి గాంధీలో బెడ్‌ దొరికినా.. వెంటిలేటర్‌ దొరక్క ఆయన విలవిల్లాడారు. ఓపిక ఉన్నంత వరకూ తెలిసిన ప్రముఖులకు ఫోన్లు చేసి వెంటిలేటర్‌ కోసం అభ్యర్థించారు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. చివరికి ఆ మసీదు పెద్ద(సదర్‌) రంజాన్‌ ముందు రోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితికి ఈ దృశ్యం అద్దంపడుతోంది. మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన పాషా(50) గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని మహ్మదీమ మసీదుకు సదర్‌. మూడు రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది తలెత్తడంతో 11 గంటల సమయంలో కారులో ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేసుకుని గచ్చిబౌలి టిమ్స్‌కు వెళ్లారు. అక్కడ రెండు గంటల పాటు గేటు బయటే ఉంచి పడకలు లేవన్నారు. తర్వాత కారులో తిరుగుతూ పలు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించగా పడకలు ఉన్నప్పటికీ వెంటిలేషన్‌ లేదనే సమాధానం వచ్చింది. నాచారంలోని ఓ ప్రైవేటు దవాఖానాలో సాయంత్రం కొద్దిసేపు ఆక్సిజన్‌ పెట్టి పరిస్థితి విషమంగా ఉందని.. గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ వెంటిలేటర్‌ కేటాయించలేదు. గురువారం కూడా దొరక్కపోవడంతో.. పలువురికి ఫోన్‌ చేశారు. తెల్లవారితే రంజాన్‌ పండుగ, వెంటిలేటర్‌ అందించేందుకు సహాయం చేయాలని వేడుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు పాషా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని