close

తాజా వార్తలు

Updated : 29/09/2020 18:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ తరపున ఆడటమే నా కల

ఇంటర్నెట్‌డెస్క్: భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన కల అని, డబ్బు సంపాదించటం కంటే ఆటను మెరుగు పరచుకోవడమే లక్ష్యమని యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌ అంటున్నాడు. లీగ్‌లో రాజస్థాన్‌ తరపున అతడు బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ‘‘కొవిడ్‌ సమయంలో లీగ్‌ నిర్వహణ సవాల్‌తో కూడుకున్న విషయమే. రాబిన్‌ ఉతప్ప, సంజూ శాంసన్‌లాంటి అనుభవజ్ఞులతో కలిసి నెట్స్‌లో  బాగా సాధన చేస్తున్నా. లైట్ల వెలుతురులో వైట్‌ బాల్‌తో ఆడటం అనేది ఓ ప్రత్యేక అనుభవం. ఇది నాకు మొదటి సీజన్‌. రాజస్థాన్‌ జట్టులో భాగంగా ఉండటం ఉత్సుకతను కలిగిస్తోంది.  ఆటతో అభిమానులను అలరించే అవకాశం నాకు దక్కింది’’ అని ఓ ఆన్‌లైన్‌ చాట్‌లో దుబాయ్‌ నుంచి మాట్లాడాడు జైస్వాల్‌.

కోహ్లీ, రోహిత్ , ధోనీ గురించి..

‘‘కోహ్లీ , రోహిత్‌, ధోనీ వంటి వారికి ఎదురు నిలిచి పోరాటం అనేది చాలా గొప్ప విషయం.  వారిలాంటి ఆటగాళ్ల నుంచి కేవలం నేర్చుకోగలం. వారు ఆట ఎంతో స్ఫూర్తిదాయకం.  ఇది నాకు ఓ గొప్ప విషయం’’అని అతడు వివరించాడు.

ముంబయిలో గడిపిన రోజుల గురించి..

‘‘టెంట్ల కింద ఉండి జీవనం సాగించటం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. కనీస అవసరాలు తీర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ నా అదృష్టం ఏమిటంటే.. మా కోచ్‌ జ్వాలా సింగ్ ఎంతో సహకారం అందించారు. సరైన మార్గంలో నన్ను నడిపించారు. నా ధ్యాసంతా ఆట మీదనే.. నన్ను నేను నిరుపించుకోవటమే లక్ష్యం. గత కొద్ది సంవత్సరాలుగా బాగా రాణిస్తున్నా. నేను ముంబయి, భారత అండర్‌-19 జట్లకు ప్రాతినిధ్యం వహించాను. దేశం తరపున, ముంబయి తరపున ఆడటం వల్ల ఎంతో నేర్చుకున్నా. డబ్బు అనేది విషయం కాదు. నా కెరీర్‌ను మలుచుకోవటమే నాకు ముఖ్యం. నేను కేవలం ఆట మీదనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. లీగ్‌ ఎంతో మంది చూస్తారు. ఇందులో ఆడటానికి అవకాశం రావటం గొప్పగా భావిస్తున్నా. చాలా మంది ఆటగాళ్లు అండర్‌ -19 నుంచి వచ్చే భారత జట్టుకు ఆడారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా కల’’అని చెప్పుకొచ్చాడు యశస్వీ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.